close
అప్పటి ముచ్చట్లు
గర్భిణని తెలీక సిగరెట్లు కాల్చిన ఆలియా తల్లి

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనీ రాజ్దాన్‌ ‘గుమ్రా’ సినిమా చిత్రీకరణ సమయంలో విపరీతంగా సిగరెట్లు కాల్చేవారు. అయితే ఆ సమయంలో ఆమె గర్భం దాల్చారు. కానీ ఈ విషయం ఆమెకు తెలీదు. ఈ విషయాన్ని సోనీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ ‘గుమ్రా’ నాకు నచ్చిన సినిమాల్లో ఒకటి. ఆ సమయంలో నేను గర్భం దాల్చాను. కానీ ఈ విషయం నాకు తెలీదు. నా పాత్రకు సంబంధించిన సన్నివేశంలో భాగంగా ఎన్నో సిగరెట్లు కాల్చాను. శ్రీదేవితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలివి’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. 
1993లో వచ్చిన ఈ సినిమాకు మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహించారు. అదే సమయంలో మహేశ్‌, సోనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంజయ్‌ దత్‌, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.