close
అప్పటి ముచ్చట్లు
ముద్దు సీన్‌ గురించి నాన్నతో చెప్పా: నాగార్జున

తీసేస్తారేమోనని కంగారుపడ్డా!

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌లో హిట్‌గా నిలిచిన చిత్రం ‘గీతాంజలి’ (1989). ఈ చిత్రం క్లైమాక్స్‌లో హీరో నాగ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్‌ గిరిజా షెట్టార్‌ను ముద్దుపెట్టుకుంటారు. ఈ సీన్‌ సినిమా మొత్తానికే హైలైట్‌ అయ్యింది. అయితే ఈ సన్నివేశాన్ని సెన్సార్‌ బోర్డు కత్తిరిస్తుందేమోనని నాగార్జున కంగారు పడ్డారట. ‘గీతాంజలి’ సమయంలో జరిగిన ఓ సంఘటనను నాగ్‌ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

‘సెన్సార్‌ బోర్డు సంప్రదాయంగా ఉండే సీన్లను మాత్రమే అనుమతిస్తుందేమోనని అప్పుడు అనుకునేవాడ్ని. అందుకే ‘గీతాంజలి’లో ముఖ్యమైన ముద్దుసీన్‌ను కట్‌ చేస్తారేమోనని కంగారుపడ్డా. అందుకే సినిమా స్క్రీనింగ్‌కు ముందు ఈ సీన్‌ గురించి నాన్నతో చెప్పా. ‘సినిమాలో ముద్దు సన్నివేశం ఉంటుంది. భావోద్వేగంతో కూడింది. సెన్సార్‌ సభ్యులు కట్‌ చేస్తారేమో..’ అని చెప్పా. షో పూర్తయిన తర్వాత నాన్న మాట్లాడుతూ.. ‘‘గీతాంజలి’ సినిమాలోని అతి ఉత్తమమైన సన్నివేశం అది. సెన్సార్‌ బోర్డు సభ్యుడు/సభ్యురాలు జీవితంలో ఎవర్నైనా ప్రేమించి ఉంటే కచ్చితంగా ఈ సన్నివేశాన్ని కత్తిరించరు’ అని నాకు హామీ ఇచ్చారు’ అని నాగ్‌ పేర్కొన్నారు. ‘గీతాంజలి’ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని తాకింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.