
ఇంటర్నెట్‌డెస్క్: ఎ.వి.ఎం వారి మూగనోము’ (1969) షూటింగ్ పూర్తయిన తర్వాత అందులో ఏఎన్నార్, జమునల మధ్య ఓ యుగళ గీతం నిర్మాత మెయ్యప్పన్‌కి నచ్చలేదట. హీరో నాగేశ్వరరావును ఓ సారి చూసి చెప్పమన్నారట. ఏయన్నార్ కూడా చిత్రీకరణ బాగా లేదని చెబుతూ, నిర్మాత కోరిక మేరకు రీషూట్ చేసేందుకు కాల్షీట్ ఇచ్చారట. అయితే మెయ్యప్పన్‌కు పాట సాహిత్యం కూడా నచ్చలేదట. దీంతో తమ సంస్థ హిందీలో నిర్మించిన ‘దో కలియా’ (తెలుగులో ‘లేతమనసులు’) లోని ‘తుమ్హారీ నజర్..’ పాట ట్రాక్‌ని బయటకు తీసి, గీత రచయిత దాశరథితో పాట రాయించి తెల్లవారేసరికల్లా పాట రికార్డ్ చేయించామని సంగీత దర్శకుడు గోవర్ధనంతో చెప్పారట. మర్నాడు ఉదయం దాశరథి పల్లవి, ఓ చరణం రాసి తీసుకు వచ్చారట. స్టూడియోలో ఘంటసాల, సుశీల వాటిని పాడుతూ ఉంటే ఆయన బయట కూర్చుని మిగిలిన చరణాలు రాసి పాట పూర్తి చేశారట. సాయంత్రానికల్లా పాట పూర్తికాగానే ఆ రాత్రి జమునతో సోలో షాట్స్ బిట్స్‌గా తీసి, మర్నాడు ఉదయాన్నే వచ్చిన ఏయన్నార్‌తో కాంబినేషన్ షాట్స్ తీసి, చిత్రీకరణ పూర్తిచేశారట. అలా హడావిడిగా రూపుదిద్దుకున్న - ‘ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..’ యుగళ గీతం ప్రేక్షకాదరణ పొందడం విశేషం.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’