Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142933
            [news_title_telugu_html] => ‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు?
            [news_title_telugu] => ‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు?
            [news_title_english] => bhanumathi reply to journalist questions
            [news_short_description] => 1974లో ఒక పత్రికలో ఒక పాఠకుడు ప్రముఖ నటి భానుమతిని ‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు? అని అడిగాడు. (అప్పట్లో కేంద్ర జాతీయ బ

            [news_tags_keywords] => bhanumathi,Tollywood,Appati muchatlu
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0208,
        )

)
‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు? - bhanumathi reply to journalist questions - EENADU
close
అప్పటి ముచ్చట్లు
‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు?

ఇంటర్నెట్‌డెస్క్‌: 1974లో ఒక పత్రికలో ఒక పాఠకుడు ప్రముఖ నటి భానుమతిని ‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు? అని అడిగాడు. (అప్పట్లో కేంద్ర జాతీయ బహుమతుల్లో ఉత్తమ నటికి ‘ఊర్వశి’ అని, ఉత్తమ నటుడికి ‘భరత్‌’ అని బిరుదులు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ బిరుదులను తొలగించారు) దానికి భానుమతి ఆ పత్రికలో ఇలా సమాధానం ఇచ్చారు.

‘‘ఊర్వశి’ అంటే తెలియని అమాయకత్వంలో నన్ను పడేసి, మరింత ఉత్తమ నటనకు ఆస్కారమైన ఊర్వశి రాలేదేంటని నన్ను అధః పాతాళానికి తోసేశారు. ఈనాడు ఏ మాత్రం విలువలేని ‘పద్మశ్రీ’ ఎందుకు పొందానా? అని బాధ పడుతున్నా. నన్ను ‘ఊర్వశి’ బిరుదు తెచ్చుకోమంటారేమిటండీ? ఈ ప్రభుత్వం వారిచ్చే ఊర్వశి, నాలాంటి నటీమణి ప్రతిభకి కొలమానమా? హతవిధీ! ఊర్వశికి అదే ప్రమాణమైతే నేను నా మొదటి చిత్రం ‘వర విక్రయం’లోనే ఊర్వశినయ్యాను. అద్భుతంగా నటించి, కన్నీరు కార్చాను. ప్రజలను కూడా కన్నీరు పెట్టించాను. ఇంకెన్నడూ ఊర్వశి కోసం ప్రయత్నించమని నన్ను అవమానపరచకండి. ఈ అవార్డు కోసం తాపత్రయపడే అలవాటు నాకు లేదు. ఒక వేళ ప్రభుత్వ వారు ఊర్వశి ఇచ్చినా తిరస్కరిస్తాను’’ అని అన్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.