
తెలంగాణ గడీల్లో దొరలు, దొరసానుల చెప్పుచేతల్లో బతికే స్త్రీల విషాదగాథలకు నిలువుటద్దం బి.నరసింగరావు తీసిన ‘దాసి’ (1988) చిత్రం. అప్పటికే ‘మా భూమి’ (1980), ‘రంగుల కల’ (1984) చిత్రాల ద్వారా తనకంటూ ఒక శైలిని, తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయి గౌరవాన్నీ సంపాదించిన నేపథ్యంతో నర్సింగరావు నిర్మించిన ‘దాసి’ తెలుగు వారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లింది. ఒక పాత్రికేయుడు ఆయనతో జరిపిన ముఖాముఖీ ‘దాసి’ కథకు పునాదులు వేసిందట. ఆ పాత్రికేయుడు గతంలో పాలమూరు ప్రాంతంలోని ఓ సంస్థానానికి వెళ్లినప్పుడు ఓ అందమైన అమ్మాయి వచ్చి ఆయన కాళ్లు కడగబోయిందట. అందుకు ఆయన తిరస్కరించగా ఆ మహిళ ఆశ్చర్యపోతూ అన్న మాటల్ని పాత్రికేయుడి నోటి ద్వారా విన్న నరసింగరావు తీవ్రంగా ఆలోచించారట. ఆ ఆలోచనలు ఓ అద్భుతమైన సృజనకు బీజాలు వేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతిభావంతుల ప్రశంసలను అందుకునే దిశగా ఆయనను నడిపించాయి. దొరల గడీల్లో దాసీల ఉదంతాల్ని తన తల్లి గారిని అడిగి తెలుసుకోడంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలు పర్యటించి, కథకు అవసరమైన 1920-40 సంవత్సరాల నాటి నేపథ్య సమాచారాన్ని విస్తృతంగా సేకరించి, ఓ అద్భుతాన్ని సృష్టించారాయన.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్