
హైదరాబాద్: ‘మురారి’.. తెలుగు కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన సినిమా. దర్శకుడు కృష్ణ వంశీ పచ్చని పొలాలు, పెద్ద కుటుంబం, పండగలాంటి వాతావరణంలో చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. ప్రత్యేకించి కథానాయకుడు మహేశ్‌బాబు కథానాయిక సోనాలీ బింద్రేని ఆటపట్టించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అరుదైన స్టిల్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని ‘బంగారు కళ్ల బుచ్చమ్మో..’ చిత్రీకరణలో తీసిన ఫొటో అది.
దీన్ని చూసిన కృష్ణ వంశీ ట్విటర్లో స్పందించారు. ‘బంగారు కళ్ల బుచ్చమ్మో లీడ్ సీన్ అది. సూపర్‌స్టార్ తన బందన చొక్కా వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు’ అని నవ్వుతూ ట్వీట్ చేశారు. స్టిల్‌లో కృష్ణ వంశీ, సోనాలీ తెగ నవ్వుతూ కనిపించారు. మహేశ్ పూర్తి డిజైన్‌తో ఉన్న తన నీలి రంగు చొక్కాను పట్టుకుని స్మయిల్ ఇచ్చారు. ‘మురారి’ సినిమాలో ప్రకాశ్‌రాజ్, లక్ష్మి, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ బాణీలు అందించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- వారంలో ఖతం