
సీనియర్ నటుడు ధర్మేంద్ర
ఇంటర్నెట్‌డెస్క్: సీనియర్ నటుడు ధర్మేంద్ర సినిమా సెట్‌కు ఉల్లిపాయలు తిని వెళ్లేవారట. అలనాటి తార ఆశా పరేఖ్‌తో కలిసి ఆయన నటించిన సినిమా ‘ఆయే దిన్ బాహర్ కే’. 1966లో వచ్చిన ఈ సినిమా సెట్లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను ధర్మేంద్ర పంచుకున్నారు. ‘డార్జిలింగ్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్యాకప్ చెప్పిన తర్వాత నిర్మాతలతోపాటు చిత్ర బృందం అంతా కలిసి అర్ధరాత్రి దాటే వరకూ పార్టీ చేసుకునేది. నేను కూడా పార్టీకి వెళ్లి, మద్యం సేవించా. తెల్లవారుజామున నోటి నుంచి మందు వాసన వచ్చేది. దాన్ని దాచిపెట్టేందుకు ఉల్లిపాయలు తినేవాడిని. అలాగే ఆశా పరేఖ్‌తో కలిసి నటించేందుకు వెళ్లేవాడిని. కానీ, ఆమెకు ఉల్లిపాయల వాసన నచ్చేది కాదు’ అని అన్నారు.
అనంతరం ఆశా పరేఖ్‌తో సలహా గురించి ఆయన ప్రస్తావించారు. ‘నేను మందు తాగానని, అది తెలియకుండా ఉండటానికి ఉల్లిపాయలు తిని సెట్‌కు వచ్చానని ఆమెకు చెప్పేశా. ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇకపై తాగొద్దని ఆమె సలహా ఇచ్చింది. ఆపై నేనూ ఆలోచించా, మందు తాగడం ఆపేశా. ఇప్పుడు ఆశా పరేఖ్, నేను మంచి స్నేహితులం. ఓ కుటుంబంలా కలిసి ఉన్నాం. గతం ఎన్నో మధుర జ్ఞాపకాల్ని ఇచ్చింది’ అని ధర్మేంద్ర చెప్పారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం