
హైదరాబాద్: చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన కథానాయకుడు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘చిరుత’. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28, 2007లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలోని రామ్‌చరణ్ డ్యాన్స్‌లకు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. నేటితో ఈ సినిమా విడుదలై సరిగ్గా 12 సంవత్సరాలు అయ్యింది.
ఈ సినిమాలో చరణ్ డ్యాన్స్‌లు చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారంట చిరంజీవి. ‘చిరుత సినిమాలో చరణ్ డ్యాన్స్ ఎలా చేశాడో అని అనుకున్నాను. డ్యాన్స్‌లో ఏమైనా తప్పులు చేశాడేమో అని తీక్షణంగా చూశాను. కొంతసమయం తర్వాత నేను రిలాక్స్ అయ్యాను. చరణ్ డ్యాన్స్ చాలా బాగా చేశాడు. చరణ్ డ్యాన్స్‌లు చూసి చాలా సంతోషించాను.’ అని చిరంజీవి తెలిపారు.
షూటింగ్ సమయంలో చాలామంది చరణ్‌ను కలిసి మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా నువ్వు వస్తున్నావు. ప్రేక్షకులను నువ్వు మెప్పించాలి అని చెప్పి చరణ్‌ను టెన్షన్‌కు గురి చేసేవారట. చరణ్ భయాన్ని గుర్తించిన చిరంజీవి ‘నువ్వు ఎవరి మాటలు వినకు. వాళ్లందరు నా మీద ఉన్న అభిమానంతో నీతో ఇలా చెబుతున్నారు. నువ్వు అసలు టెన్షన్ పడకు.’ అని చరణ్‌కు తెలిపారట.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!