close
అప్పటి ముచ్చట్లు
ఆర్నెల్లపాటు టీ.. బన్నుతోనే గడిపా!

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల నటుడిగా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు అలీ. కథానాయకుడి సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్లీ కమెడియన్‌గా సక్సెస్‌ సాధించిన అతి తక్కువ మందిలో ఆయనొకరు. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే అలీ మద్రాసులో ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రమంటే ‘ప్రేమఖైదీ’ అనే చెప్పాలి. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనను ఓ సందర్భంలో పంచుకున్నారిలా..!

‘‘మద్రాసుతో పోలిస్తే హైదరాబాద్‌లో పడిన కష్టాలు నా దృష్టిలో అసలు కష్టాలే కావు. మద్రాసులో స్ట్రగుల్‌ అయితేనే స్టార్‌ అవుతాడని చెప్పుకొనేవాళ్లు అప్పట్లో. అక్కడ ఆర్నెళ్లపాటు టీ, బన్నుతోనే గడిపాను. డబ్బుల్లేకపోతే ఎవరినీ అడిగేవాణ్ని కాదు. వీడు డబ్బులు అడగడం మొదలుపెట్టాడ్రోయ్‌ అంటారని. ఇంట్లో అడిగితే ఇచ్చేవాళ్లే. కానీ అది నాకు ఇష్టం ఉండేది కాదు. కమెడియన్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చిందంటే ‘ప్రేమఖైదీ’తోనే. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ చిత్రంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.’’

‘‘అప్పటికి నేను మద్రాసులోనే ఉన్నా. ‘ప్రేమఖైదీ’ కోసం నేను ఎంపికయ్యా. ఇంకో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌ బయల్దేరాల్సి ఉంటుందని చెప్పేవాళ్లు, మళ్లీ క్యాన్సిల్‌ అనేవాళ్లు. ఒక రోజు నేనొక సినిమాకి వెళ్లా. అప్పుడే మా రూమ్‌కి మనిషి వచ్చి, ‘అర్జెంటుగా హైదరాబాద్‌ బయల్దేరాలి’ అని చెప్పాడట. నేనేమో లేను. తిరిగొచ్చాక చూస్తే అప్పటికే నేను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దాంతో నా సొంత డబ్బులతో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కి టికెట్‌ బుక్‌ చేసుకొని బయల్దేరా. తీరా సికింద్రాబాద్‌ స్టేషన్‌కి ఇంకాసేపట్లో చేరుకొంటామనగా రైలు ఆగిపోయింది. ‘రిజర్వేషన్లకి సంబంధించి ఏదో చెకింగ్‌ జరుగుతోంది, బండి ముందుకెళ్లదు’ అన్నారు. ఒకపక్కేమో షూటింగ్‌కి వెళ్లాలి. నేను రాలేదంటే, వేరెవర్నైనా తీసుకొంటారేమోననే కంగారు. దాంతో చేసేది లేక పెట్టె పట్టుకొని రైలు పట్టాల మీదుగా రెండు కిలోమీటర్లుపైగా నడుచుకుంటూ వెళ్లా. రైలు ఆగింది కానీ.. నా ప్రయాణం మాత్రం ఆగలేదన్నమాట. తీరా స్టేషన్‌ చేరుకొన్నాక ఫిల్మ్‌నగర్‌ అంటే ఆటోవాళ్లు ఎవరూ రావడం లేదు. అందరూ ‘నై ఆతా’ అనేవాళ్లే. ఒకడొచ్చి ‘అన్నపూర్ణ స్టూడియో వరకూ వస్తా’నంతే అన్నాడు. సరే పద అని చెప్పి, జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర దిగిపోయి... అక్కడ్నుంచి నడుచుకుంటూ ఫిల్మ్‌నగర్‌ వెళ్లి చిత్రబృందాన్ని కలుసుకొన్నా’’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు. అన్నట్లు ఈరోజు అలీ పుట్టినరోజు. 
 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.