
ఇంటర్నెట్డెస్క్: నటి విజయశాంతి సినీ స్థాయిని పెంచిన చిత్రం ‘ప్రతిఘటన’. టి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1986లో విడుదలై గొప్ప విజయం అందుకుంది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇందులో విజయశాంతితో పాటు చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను కూడా అందుకుంది. ఉత్తమ నటిగా విజయశాంతి, ఉత్తమ గాయనిగా ఎస్.జానకి, ఉత్తమ మాటల రచయితగా హరనాథరావుకు అవార్డులు దక్కాయి. విజయశాంతి కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా విడుదలై నేటితో 34 ఏళ్లు పూర్తయ్యాయి. నిజానికి ఇందులో నటించేందుకు డేట్స్ ఏ మాత్రం కుదరలేదని ఒకప్పుడు విజయశాంతి అన్నారు. దర్శకుడు పట్టుబట్టడంతో అతి కష్టం మీద ఇతర ప్రాజెక్టుల నిర్మాతలతో మాట్లాడి డేట్స్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘ప్రతిఘటన’ సినిమాని నెల రోజుల్లో పూర్తి చేశాం. నా కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇది ఒకటి. అయితే దర్శకుడు టి. కృష్ణ ఈ సినిమాకి అడిగినప్పుడు డేట్స్ ఖాళీలేవు. ఆయనేమో ‘మా శాంతమ్మే చెయ్యాలి’ అన్నారు. ఇతర నిర్మాతలతో మాట్లాడి, ఆ సినిమాకి కష్టంమీద డేట్స్ ఇవ్వగలిగాను’ అని ఆమె చెప్పుకొచ్చారు.
అప్పటివరకు హీరోగా నటిస్తున్న తాను ‘ప్రతిఘటన’ కోసం విలన్గా మారానని నటుడు చరణ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో అవకాశం రావడం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిఘటన’ సినిమాలో విలన్ పాత్రకు నన్ను తీసుకోవాలని కృష్ణ అనుకున్నారు. కానీ, మిగిలిన వారు నేను సరిపోనని ఆయనతో అన్నారట. కృష్ణ వారి మాటలు వినలేదు. నా దగ్గరికి వచ్చి కథ చెప్పారు. నాది విలన్ పాత్ర అన్నారు. ‘కన్నడలో హీరోగా పది సినిమాలు చేస్తున్నా.. విలన్గా అంటారేంటి?’ అన్నాను. దీంతో ఆయన ఇందులో హీరో లేడు. మీరే హీరో.. మీరే విలన్ అన్నారు. చివరికి ఒప్పుకొన్నా. పాత్ర కోసం గడ్డం పెంచుకోమని చెప్పారు. దీంతో నా జీవితంలో తొలిసారి గడ్డం పెంచాను. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు రావడానికి బెంగళూరులో విమానం ఎక్కా. ‘నేను సరిగ్గా నటించకూడదు, నన్ను ప్రాజెక్టు నుంచి తీసేయాలి’ అని దేవుడ్ని ప్రార్థించా (నవ్వుతూ). నా తొలిరోజు షూట్ వైజాగ్లో జరిగింది. తొలి షాట్ పెద్ద డైలాగ్ ఇచ్చారు.. ఏదో విధంగా చెప్పేశా. షాట్ ఓకే అన్నారు.. అందరూ క్లాప్స్ కొట్టారు. మొదట నన్ను విమర్శించిన వారే తర్వాత మెచ్చుకున్నారు. అప్పుడు నాకు తెలుగు రాదు. డైలాగ్లు తప్పుగా చెప్పేవాడిని. సెట్లో విజయశాంతి నాతో బాగా ఆడుకున్నారు’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!