
రావుగోపాల్ రావు లొట్టలేసుకుంటూ తినేవారు
ఇంటర్నెట్‌డెస్క్: ఒకప్పుడు అలనాటి నటులు ఎన్టీఆర్, రావుగోపాల్ రావు.. వీరంతా సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవారు. ఓసారి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సెట్స్‌కు వెళ్లి సీన్స్ చదివి వినిపిస్తున్నారు. అదే సమయంలో గోపాలకృష్ణ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ఆయన సతీమణి తొక్కు పచ్చళ్లు ఎక్కువగా పెడుతుండేవారు. ఓసారి రావుగోపాల్ రావు ఆ వంటలను రుచిచూశారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా గోపాలకృష్ణ ఇంటి నుంచి క్యారేజ్ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే రావుగోపాల్ రావు..‘ఆ క్యారేజ్‌ని గోపాలకృష్ణతో పాటు ఎవరు ముట్టుకున్నా నా మీద ఒట్టే’ అని అరిచేశారట. ఇందుకు గోపాలకృష్ణ కూడా ఒప్పుకోక తప్పలేదు. రావుగోపాల్ రావు స్వయంగా భోజనం వడ్డించుకుని ఒక్కో ముద్ద తింటూ..‘ఈ ముద్ద జస్టిస్ చౌదరి, ఈ ముద్ద కొండవీటి సింహం, ఈ ముద్ద ఖైదీ..’ అంటూ లొట్టలేసుకుని తినేవారట.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..