
ఇంటర్నెట్‌డెస్క్: ‘అతనొక్కడే’ నుంచి ఇటీవల వచ్చిన ‘సైరా’ వరకూ స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సురేందర్‌రెడ్డి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న ఆయన కొన్నిసార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు అయితే, తొలి చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సురేందర్‌రెడ్డికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడగ్గా సురేందర్‌రెడ్డి అవుననే సమాధానం ఇచ్చారు.
‘‘అవును నా రెండో చిత్రం ప్రభాస్‌తో తీయాలనుకున్నా. కానీ, కుదరలేదు. ‘అతనొక్కడే’ విజయం తర్వాత నాకు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, అప్పటికే ప్రభాస్‌తో సినిమా చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నా. అదే సమయంలో తారక్‌తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నన్ను కోరారు. ఆయన మాట కాదనలేక సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. పైగా అప్పటికి ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనతో చేయకపోతే బాగుండదేమోనని వెళ్లి తారక్‌ను కలిశా. చర్చల అనంతరం ఓ ప్రాజెక్టును ఓకే చేశారు. అదే ‘అశోక్’. అయితే, ఇది ప్రభాస్‌తో తీద్దామనుకున్న కథ కాదు. అప్పటికే కథ సిద్ధంగా ఉండటంతో చిన్న చిన్నమార్పులతో సినిమా తెరకెక్కించా’’ అని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు