close
హాలీవుడ్

అందగత్తెను కానని కామెంట్లు చేస్తున్నారు

ఇది నన్ను చాలా బాధిస్తోంది: జస్టిన్‌ బీబర్‌ సతీమణి

అందగత్తెను కానని కామెంట్లు చేస్తున్నారు

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్న వయసులోనే ‘ఓ బేబీ.. బేబీ..’ అంటూ అందర్నీ ఆకట్టుకున్న పాప్‌స్టార్‌ జస్టిన్‌ బీబర్‌. ఆయన కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్న అమెరికన్‌ మోడల్‌ హైలీ బాల్డ్‌విన్‌ను న్యూయార్క్ కోర్టు హౌస్‌లో ఇటీవల వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని హైలీ అంకుల్ అలెక్ బాల్డ్‌విన్ ధ్రువీకరించారు. హైలీకి కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 16.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఓ పాప్‌స్టార్‌ సతీమణిగా, మోడల్‌గా ఎంతో ఆనందంగా ఉంటారని అందరూ అనుకోవడం సాధారణమే. కానీ.. తన వ్యక్తిగత జీవితం గురించి హైలీ తాజాగా ఓ పోస్ట్‌ చేశారు. ప్రతిరోజూ నెటిజన్లు తనను ఇతరులతో పోల్చుతూ కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలని, అభిమానులు కూడా అలానే ఉండాలని సందేశం ఇచ్చారు.

అందగత్తెను కానని కామెంట్లు చేస్తున్నారు

‘కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం.. వ్యక్తిగత విషయాల పరంగా ఇంకాస్త ఓపెన్‌గా ఉండాలి అనుకుంటున్నా. నేను ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలని కోరుకుంటున్నా. నాకు 22 ఏళ్లు. నేను అభద్రతా భావంతో బాధపడుతున్నా, నా హృదయానికి గాయమైంది. నాకూ భయం, ఉత్సుకత, కోపం ఉన్నాయి. నా లుక్‌ పరంగా రోజూ ఎన్నో కామెంట్లు వస్తుంటాయి. నేను పెద్ద అందగత్తెను కానని ఇతరులతో పోల్చుతుంటారు. ఇది నన్నో ఎంతో బాధించింది. దీని వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతున్నా.. నేను అందంగా లేననే భావన కూడా కలుగుతోంది. రోజూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటానికి పోరాటం చేస్తున్నా. మీ దయ, జాలి పొందాలనే ఉద్దేశంతో నేను ఈ పోస్ట్‌ చేయడం లేదు. నేనూ మనిషినే, అందరిలా జీవించడం నేర్చుకుంటున్నా అని గుర్తు చేయడానికి చేస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యల వల్ల చాలా రోజులు ఏడ్చా. మనందరిలోనూ లోపాలున్నాయి, అవి ఎప్పటికీ మారవు. దేవుడు కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కర్ని ఒక్కో విధంగా సృష్టిస్తాడు. అందం, వ్యక్తిత్వం, గుణం.. ఇవన్నీ ఆయన ఇచ్చినవే. దేవుడు ఎప్పటికీ తప్పులు చేయడు. ఈ ఏడాది నాకు గొప్పగా ఉండబోతోంది. నేను నేనుగా జీవించాలి అనుకుంటున్నా’ అని హైలీ పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ చూసిన జస్టిన్‌ బీబర్‌ ‘దిస్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ హన్‌’ అని కామెంట్‌ చేశారు.

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.