close
హాలీవుడ్
దేన్నైనా ఐస్‌గా మార్చేసే మహారాణి!

‘ఫ్రోజెన్‌ 2’ ట్రైలర్‌ విడుదల

లాస్‌ఏంజెల్స్‌: వాల్ట్‌ డిస్నీ సంస్థ నుంచి వస్తున్న మరో కంప్యూటర్‌ యానిమేటెడ్‌ ఫాంటసీ చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. 2013లో వచ్చిన ‘ఫ్రోజెన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. క్రిస్‌ బక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. అరెండెల్‌ అనే రాజ్యంలోని చెట్లకు మాటిమాటికీ మంటలు అంటుకుంటూ ఉంటాయి. ఆ మంటలు విచిత్రంగా గులాబీ రంగులో ఉంటాయి. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు మహారాణి అయిన ఎల్సా దేన్నైనా ఐస్‌గా మార్చేసే తన శక్తుల్ని ఉపయోగిస్తుంది. అసలు తనకు ఆ శక్తి ఎలా వచ్చింది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు తన సోదరి ఆన్నాతో కలిసి ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయలుదేరుతుంది ఎల్సా. ఆ తర్వాత ఏం జరిగింది?అన్నదే సినిమా కథ. నవంబర్‌ 22న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.