close
హాలీవుడ్
‘వెనమ్‌’కు సీక్వెల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టామ్‌ హార్డీ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వెనమ్‌’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. మార్వెల్‌ కామిక్స్‌ పాత్రల్లో ఒకటైన సూపర్‌హీరో పాత్ర వెనమ్‌. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత అమీ పాస్కల్‌ స్పష్టం చేశారు. 

‘టామ్‌ హార్డీ మళ్ళీ తప్పక వస్తాడని చెప్పగలను. అతను చేసిన పాత్రలో మరొకరు నటించలేరు. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి సోనీ ఈ ఫ్రాంఛైజీని కొనసాగించాలని అనుకుంటోంది. ఇక రెండోది టామ్‌ హార్డీ. వెనమ్‌ అంటే అతనే గుర్తుకు వస్తాడు. మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం’ అని అమీ పాస్కల్‌ అన్నారు. దాదాపు 100మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వెనమ్‌’కు మిశ్రమ స్పందన వచ్చినా,  ప్రపంచవ్యాప్తంగా 855 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. 
 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.