close
హాలీవుడ్
ఇండియాకు ముందుగానే స్పైడర్‌ మ్యాన్‌

స్పైడర్‌ మ్యాన్‌ చిత్రాల అభిమానుల్ని అలరించడానికి మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది మార్వెల్‌  స్టూడియోస్‌. 2017లో వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌ కమింగ్‌’కు సీక్వెల్‌గా ‘స్పైడర్‌ మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తెరకెక్కింది. టామ్‌ హోలాండ్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌’గా నటిస్తున్న ఈ చిత్రం మన దేశంలో ఒకరోజు ముందే విడుదల కానుంది. ముందుగా వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయలనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక అభిమానుల నుంచి వస్తోన్న స్పందనతో 4నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘మనదేశంలో ఎంతో అభిమానించే సూపర్‌ హీరో ‘స్పైడర్‌ మ్యాన్‌’. ‘స్పైడర్‌ మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ట్రైలర్‌ విడుదలఅయ్యాక సినిమాపై క్రేజ్‌ పెరిగిపోయింది. అందుకే అభిమానుల కోసం వచ్చే నెల 4నే ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 30 నుంచే అడ్వాన్స్‌ బుకింగ్‌లు మొదలుకానున్నాయి’’ అని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. జాన్‌ వాట్స్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌, జెన్‌డయా, కోబీస్మల్డర్స్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.