close
హాలీవుడ్
ప్రపంచం కోసం ఈ శత్రువులు ఏం చేశారు?

‘స్పైస్‌ ఇన్‌ డిస్‌గైజ్‌’ ట్రైలర్‌ విడుదల

లాస్‌ఏంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌స్మిత్, టామ్‌ హోలాండ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పైస్‌ ఇన్‌ డిస్‌గైజ్‌’. ఇదో యానిమేటెడ్‌ స్పై చిత్రం. ట్రాయ్‌ క్వేన్‌, నిక్‌ బ్రూనో సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. లాన్స్‌ అనే సూపర్‌ స్పై (విల్‌ స్మిత్‌), వాల్టర్‌ బెకెట్‌ అనే శాస్త్రవేత్త (టామ్‌ హోలాండ్‌) శత్రువులు. లాన్స్‌ నెమ్మదస్తుడు. వాల్టర్‌ అలా కాదు. వాల్టర్‌ చేసే పనులు లాన్స్‌కు చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రపంచాన్ని కాపాడేందుకు చేతులు కలపాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో వాల్టర్‌  కనిపెట్టిన ఓ మందుని లాన్స్‌ తాగేస్తాడు. దాంతో అతని శరీరంలో మార్పులు జరిగి పావురంలా మారిపోతాడు. మరి ప్రపంచాన్ని కాపాడటానికి వీరిద్దరూ కలిసి ఏం చేశారు? అన్నదే సినిమా కథ. క్రిస్మస్‌కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.