close
హాలీవుడ్
‘అవెంజర్స్‌’.. ది బాక్సాఫీస్‌ కింగ్‌!

మార్వెల్‌కు శుభాకాంక్షలు తెలిపిన జేమ్స్‌ కామెరూన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్‌ కింగ్‌గా మారింది. ఇన్నాళ్లూ అత్యధిక వసూళ్ల పరంగా ‘అవతార్‌’ అగ్రస్థానంలో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తాజాగా బీట్‌ చేసి, చరిత్ర సృష్టించింది. జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు రాబట్టింది. 2009లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్లు పరంగా అగ్ర స్థానంలోనే ఉంది. ఇన్నేళ్లలో దీన్ని ఏ సినిమా దాటలేకపోయింది. అయితే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. దానికి తగ్గట్టే సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 2.79 బిలియన్‌ డాలర్లు రాబట్టి ‘అవతార్‌’ రికార్డును చెరిపేసింది. అంతేకాదు ఈ సినిమా చైనా, భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది.

‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ కలెక్షన్స్‌ మరింత పెంచాలనే ఉద్దేశంతో మార్వెల్‌ స్టూడియోస్‌ అదనపు సన్నివేశాలు జోడించి రెండోసారి గత నెల 28న థియేటర్లలో విడుదల చేసింది. ఊహించినట్లే సినిమా ఇప్పుడు కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానం దక్కించుకుంది. ‘అవతార్‌’ రెండో స్థానంలో చేరింది. ఈ సందర్భంగా ‘అవతార్‌’ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మార్వెల్‌ స్టూడియోస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.