
నా మాటలతో దర్శకుడికి కోపమొచ్చింది
ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన ‘అవతార్’ సినిమా టైటిల్ తాను సూచించిందేనని ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అన్నారు. అయితే అప్పట్లో ఈ సినిమాలో నటించాలని కోరితే మాత్రం తిరస్కరించానని చెప్పారు. ‘అవతార్’ సినిమాను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొన్నటి వరకూ అత్యధిక వసూళ్ల పరంగా ప్రథమ స్థానంలో ఉంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇటీవల దాని రికార్డును అధిగమించింది. ఇప్పుడు ‘అవతార్’ రెండో స్థానంలో చేరింది.
ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ.. ‘‘అవతార్’ టైటిల్ నేనే ఇచ్చా. చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. సినిమా అద్భుత విజయం సాధిస్తుందని జేమ్స్ కెమెరూన్‌కు ముందే చెప్పా. అంతేకాదు సినిమా మొత్తం పూర్తి చేయడానికి దాదాపు ఏడేళ్లు పట్టేలా ఉందని కూడా అన్నాను. దీంతో ఆయనకు కోపం వచ్చింది. నేను ‘అవతార్’కు ఏడేళ్లు తీసుకుంటానని నువ్వు అంత కచ్చితంగా ఎలా చెబుతున్నావు? అని నన్ను ప్రశ్నించారు. మీరు ఊహించింది జరగడం, అలా సినిమాను తీర్చిదిద్దడం తక్కువ సమయంలో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశాను. ఆయన సినిమాలో గ్రహాంతరవాసుల్ని చూపించారు. నేను 410 రోజులు షూటింగ్లో పాల్గొనాలని జేమ్స్ కెమెరూన్ అన్నారు. కానీ శరీరం మొత్తం రంగులు రాసుకోవడం నాకిష్టం లేదు. అలా నేను చేయలేను.. క్షమించండి అన్నాను’ అని చెప్పారు.
గోవింద 2012లో ‘అవతార్ బ్యాక్’ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. పహ్లాజ్ నిహ్లానీ దీన్ని తెరకెక్కించారు. సన్నీ దేవోల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ సినిమా ఇంత వరకూ విడుదలకు నోచుకోలేదు. మరోపక్క ‘అవతార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్