close
హాలీవుడ్
‘థోర్‌’ ఇలా ఎలా మారాడో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: థోర్‌.. ఈ పేరు వినగానే చురుకైన చూపు.. కండలు తిరిగిన దేహం.. చేతిలో సుత్తి ఇవే గుర్తుకొస్తాయి. అవెంజర్స్‌ బృందంలో సభ్యుడైన థోర్‌ సుత్తి పట్టుకుని శత్రుమూకలను చీల్చి చెండాడుతుంటే, ప్రేక్షకులకు భలే మజాగా ఉంటుంది. మరి అంతటి ధీరోదాత్తుడు.. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లో థానోస్‌ను అంతం చేసిన తర్వాత దూరంగా వెళ్లి బతుకుతాడు. ఆరు పలకల దేహంతో ఉండే ధోర్‌ ఫ్యామిలీ ప్యాక్‌కు వచ్చేస్తాడు. ఇదేలా సాధ్యమైందో థోర్‌ పాత్ర పోషించిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

‘థోర్‌ సరికొత్త వెర్షన్‌’ అంటూ తాను ఎలా మారిపోయిందీ అందులో తెలియజేశాడు.  ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’లో ఊబకాయుడిగా మారిపోయిన థోర్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక వసూళ్ల పరంగా ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ‘అవతార్‌’ను ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ అధిగమించింది. 2.79 బిలియన్‌ డాలర్లు రాబట్టి ‘అవతార్‌’ రికార్డును చెరిపేసింది. మరి థోర్‌ ఎలా మారాడో మీరూ చూసేయండి. 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.