Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141403
            [news_title_telugu_html] => 

చైనాలో భారత్‌ సినిమా రికార్డు!

[news_title_telugu] => చైనాలో భారత్‌ సినిమా రికార్డు! [news_title_english] => 2 Point 0 film to release in China on Sep 6th [news_short_description] => సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా చైనాలో రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను సెప్టెంబరు 6న అక్కడ.... [news_tags_keywords] => 2Point0,China,rajinikanth [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209,1107, ) )
చైనాలో భారత్‌ సినిమా రికార్డు! - 2 Point 0 film to release in China on Sep 6th - EENADU
close
హాలీవుడ్
చైనాలో భారత్‌ సినిమా రికార్డు!

సెప్టెంబరు 6న విడుదల కాబోతోన్న ‘2.ఓ’ 

బీజింగ్‌‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా చైనాలో రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను సెప్టెంబరు 6న అక్కడ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై చిత్రం విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి విదేశీ చిత్రం ‘2.ఓ’ అని తెలిపింది.

లైకా ప్రొడక్షన్స్‌.. హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి సినిమాను చైనాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. నిజానికి జులై 12న ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ ఇదే సమయంలో హాలీవుడ్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల కాబోతుండటంతో ‘2.ఓ’ను వాయిదా వేశారట. 47 వేల కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న ఈ ఇండియన్‌ భారీ బడ్జెట్‌ చిత్రం చైనాలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు విమర్శకులు అంచనా వేస్తున్నారు. ‘రోబో’కు సీక్వెల్‌గా తీసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయికగా కనిపించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది నవంబరులో విడుదలై రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.