Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142966
            [news_title_telugu_html] => 

ఎవరూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు: మాజీ నటి

[news_title_telugu] => ఎవరూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు: మాజీ నటి [news_title_english] => Mia Khalifa says she has earned very little money [news_short_description] => అడల్ట్‌ చిత్రాల్లో నటించడం ద్వారా తానేమీ మిలియన్ల కొద్దీ డబ్బులు సంపాదించలేదని మాజీ నటి మియా ఖలీఫా చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో [news_tags_keywords] => Mia Khalifa,Hollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209, ) )
ఎవరూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు: మాజీ నటి - Mia Khalifa says she has earned very little money - EENADU
close
హాలీవుడ్
ఎవరూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు: మాజీ నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: అడల్ట్‌ చిత్రాల్లో నటించడం ద్వారా తానేమీ మిలియన్ల కొద్దీ డబ్బులు సంపాదించలేదని మాజీ నటి మియా ఖలీఫా చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అడల్ట్‌ చిత్రాల్లో నటించడం ద్వారా తన మొత్తం కెరీర్‌లో సంపాదించింది కేవలం 12వేల డాలర్లు మాత్రమేనని తెలిపింది. 

‘‘పోర్న్‌ చిత్రాల్లో నటించడం ద్వారా నేను కోట్లు సంపాదించానని ప్రజలు అనుకుంటున్నారు. నా మొత్తం సంపాదన 12వేల డాలర్లను దాటలేదు. అంతకుమించి ఒక్క పైసా కూడా సంపాదించలేదు. అడల్ట్‌ చిత్రాల్లో నటించడం మానేసిన తర్వాత నాకు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంది. భయం వేస్తోంది. నేను ఎప్పుడూ మిలయన్ల కొద్దీ సంపాదించాలని అనుకోలేదు. నాపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయంపై స్పష్టత ఇవ్వడానికే ఈ సమాధానం చెబుతున్నా’’ అని చెప్పుకొచ్చింది.

హిజాబ్‌ ధరించి ఓ అడల్ట్‌ చిత్రంలో నటించినందుకు గానూ ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ నుంచి గతంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై న్యూయార్క్‌ పోస్ట్‌లో మియా మాట్లాడుతూ.. ‘హిజాబ్‌ ధరించి నటించడం నిజంగా ఓ టర్నింగ్‌ పాయింట్‌. ఆ వార్త కారణంగా అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నా పేరు మార్మోగిపోయింది. అన్నింటిలోనూ ట్రెండింగ్‌లో ఉన్నా. చాలా దేశాలు నాపై నిషేధం విధించాయి. అప్పటి వరకూ నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను 400మంది మాత్రమే అనుసరిస్తుండగా, మూడు రోజుల్లో ఆ సంఖ్య 2లక్షలకు చేరింది. ఆ తర్వాత నా ఇన్‌స్టా ఖాతాను ఐసిస్‌ హ్యాక్‌ చేసింది. ప్రస్తుతం స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నా’ అని మియా తెలిపింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.