Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145780
            [news_title_telugu_html] => చావడానికి సమయం లేదంటున్న బాండ్‌
            [news_title_telugu] => చావడానికి సమయం లేదంటున్న బాండ్‌
            [news_title_english] => 
            [news_short_description] => ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌లో 25వ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. డేనియల్‌ క్రేగ్‌ ఐదో సారి బాండ్‌గా నటిస్తున్నారు. కేరీ ఫుకునగ దర్శకుడు. ఈ చిత్రానికి ‘నో టైమ్‌ టు డై’ అనే పేరు ఖరారు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది.

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [news_sections] => ,0209,
        )

)
చావడానికి సమయం లేదంటున్న బాండ్‌ - EENADU
close
హాలీవుడ్
చావడానికి సమయం లేదంటున్న బాండ్‌

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌లో 25వ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. డేనియల్‌ క్రేగ్‌ ఐదో సారి బాండ్‌గా నటిస్తున్నారు. కేరీ ఫుకునగ దర్శకుడు. ఈ చిత్రానికి ‘నో టైమ్‌ టు డై’ అనే పేరు ఖరారు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8న అమెరికాలో విడుదలవుతున్న ఈ చిత్రం దానికి ఐదు రోజులు ముందుగానే ఏప్రిల్‌ 3న భారత్‌లో ప్రదర్శితం కానుంది. ఎంఐ6 ఏజెంట్గా బాధ్యతల నుంచి తప్పుకుని జమైకాలో విశ్రాంతి తీసుకుంటున్న బాండ్‌ దగ్గరికి అతని మాజీ సహచరుడు వస్తాడు. ఓ శాస్త్రవేత్తను అపహరించిన వాడిని పట్టుకునే విషయంలో సాయం చేయమని కోరతాడు. దీంతో వేట మొదలుపెట్టిన బాండ్‌కు ఎలాంటి క్లిష్ట పరిస్థితులెదురయ్యాయి? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అరాచకాలకు తెగబడే విలన్‌ను ఎలా పట్టుకున్నాడన్న కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.