Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001036
            [news_title_telugu_html] => 

ఈసారి ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలు లేరు!

[news_title_telugu] => ఈసారి ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలు లేరు! [news_title_english] => Deepika and Priyanka out of Forbes Highest Paid Actresses list [news_short_description] => బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ 2019 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల జాబితాను విడుదల చేసింది.... [news_tags_keywords] => Deepika Padukone, Priyanka Chopra,Scarlett Johansson, Forbes [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209, ) )
ఈసారి ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలు లేరు! - Deepika and Priyanka out of Forbes Highest Paid Actresses list - EENADU
close
హాలీవుడ్
ఈసారి ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలు లేరు!

రూ.400 కోట్లతో నం.1గా స్కార్లెట్‌

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ 2019 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల జాబితాను విడుదల చేసింది. ఇందులో హాలీవుడ్‌ బ్యూటీ స్కార్లెట్‌ జాన్సన్‌ అగ్ర స్థానంలో నిలిచారు. 2018 ఫోర్బ్స్‌ జాబితాలోనూ అత్యధికంగా ఆర్జిస్తున్న నటిగా ఆమే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. స్కార్లెట్‌ నటిస్తున్న సినిమా ‘బ్లాక్‌ విండో’. ఈ చిత్రం కోసం ఆమె ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి అధిక మొత్తంలో పారితోషికం తీసుకున్నారు. ఆమె 2019లో దాదాపు రూ.400 కోట్లు (56 మిలియన్‌ డాలర్లు) ఆర్జించారు.

ఈ జాబితాలో రెండో స్థానంలో సోఫియా వర్గరా దాదాపు రూ.315 కోట్లు (44.1 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి, రెండో స్థానంలో నిలిచారు. దాదాపు రూ.250 కోట్లతో (35 మిలియన్‌ డాలర్లు) రీస్ విథర్‌స్పూన్‌టో మూడో స్థానాల్ని దక్కించుకున్నారు. నికోల్‌ కిడ్మాన్‌, జెన్సీఫర్‌ అనిస్టన్‌ రూ.245 కోట్లు (34 మిలియన్‌ డాలర్లు), రూ.200 కోట్లు (28 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్‌-2019 జాబితాలో ఒక్క బాలీవుడ్‌ నటి కూడా చోటు దక్కించుకోలేదు. 1 జూన్‌ 2018- 1 జూన్‌ 2019 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించిన నటుల జాబితాను ఇటీవల ప్రకటించారు. ఇందులో భారత్‌ నుంచి రూ.466 కోట్లతో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.