close
హాలీవుడ్
ఆరు భాషల్లో కొత్త టెర్మినేటర్‌

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకున్న ‘టెర్మినేటర్‌’ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’. ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ మరోసారి టెర్మినేటర్‌గా కనిపించబోతున్నారు. ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కెమెరాన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’ కథకు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. భారత్‌లో ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా మొత్తం ఆరు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఫాక్స్‌స్టార్‌ ఇండియా ప్రకటించింది. నవంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.