Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008317
            [news_title_telugu_html] => 

మహిళా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు రావాలి

[news_title_telugu] => మహిళా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు రావాలి [news_title_english] => Pierce Brosnan pitches for a female Bond [news_short_description] => ‘ఇంకా ఎన్నాళ్లయ్యా శాస్త్రి.. ఎప్పుడు చూడూ అదే హీరోలు. అవే సినిమాలు.. కొత్త వాళ్లని రానివ్వరా’ అంటూ ఎంఎస్‌ నారాయణను హీరోను చూసే ఉద్దేశంతో ‘ [news_tags_keywords] => pierce brosnan,James bond,Hollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209, ) )
మహిళా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు రావాలి - Pierce Brosnan pitches for a female Bond - EENADU
close
హాలీవుడ్
మహిళా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు రావాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఇంకా ఎన్నాళ్లయ్యా శాస్త్రి.. ఎప్పుడు చూడూ అదే హీరోలు. అవే సినిమాలు.. కొత్త వాళ్లని రానివ్వరా’ అంటూ ఎంఎస్‌ నారాయణను హీరోను చూసే ఉద్దేశంతో ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు అంటారు. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ఏ చిత్ర పరిశ్రమను చూసినా అది నిజమేననిపిస్తుంది. ఒకప్పటి జేమ్స్‌ బాండ్‌ అయిన ప్రియస్‌ బ్రోసనన్‌ కూడా ఇప్పుడు అదే చెబుతున్నాడు. జేమ్స్‌ బాండ్‌ అంటే మనకు గుర్తొచ్చేది సాహసాలు చేసే హీరోలే. అయితే, మహిళా జేమ్స్‌ బాండ్‌ వెండితెరపై రావాల్సిన సమయం ఆసన్నమైందని బ్రోసనన్‌ చెప్పుకొచ్చాడు. 

‘‘గత 40ఏళ్లుగా జేమ్స్‌ బాండ్‌ పాత్రను పురుషులే చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పుకోండి అబ్బాయిలు. మహిళకు ఆ  అవకాశం ఇవ్వండి. అలా చేస్తే చాలా సంతోషం. వారిని ప్రోత్సహించిన వాళ్లమవుతాం’’ అని నాలుగుసార్లు జేమ్స్‌ బాండ్‌గా వెండితెరపై కనిపించిన బ్రోసనన్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలోనూ బ్రోసనన్‌ మహిళా నటులకు మద్దతుగా నిలిచారు. చిత్ర పరిశ్రమ మారాల్సిన సమయం ఆసన్నమైందని అప్పట్లో అన్నారు. కాగా, తాను జేమ్స్‌ బాండ్‌గా నటించడం తనకు దగ్గిన అపూర్వ గౌరవమని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా బాండ్‌ 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత నటి లష్నా లీంచ్‌ బాండ్‌గా సినిమా తెరకెక్కిస్తారని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 
 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.