
ఇంటర్నెట్‌డెస్క్: హాలీవుడ్ సూపర్ హీరోలందరూ కలిసి థానోస్‌ను అంతం చేసిన చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ భాషల్లోనూ కాసులు వర్షం కురిపించింది. అంతేకాదు, జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ కలెక్షన్లు సైతం బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాట్లాడారు. ‘అవెంజర్స్:ఎండ్‌గేమ్’ విజయం తనకు మరింత నమ్మకాన్ని పెంచిందని అన్నారు.
‘‘ప్రజలు ఇంకా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తారన్న దానికి నిదర్శనం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ‘అవతార్2’, ‘అవతార్3’లను తెరకెక్కిస్తున్న నేను.. ఈ విషయంలోనే చాలా భయపడ్డా. ప్రపంచం మారిపోయిందనుకున్నా. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండదనుకున్నా. కానీ, ‘అవెంజర్స్’ నమ్మకాన్ని పెంచింది’’ అని అన్నారు.
‘‘నేటి ఆధునిక యుగంలో ’అవతార్2’, ‘అవతార్3’ అద్భుతమైన విజయాలను అందుకుంటాయో లేదో ఎవరం చెప్పలేం. కానీ, మా ప్రయత్నం మేము చేస్తాం. అది జరగవచ్చు.. జరగకపోవచ్చు. కానీ, జరగడానికే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం ఎక్కడ చూసినా స్ట్రీమింగ్ సేవలు అందుబాటులో ఉన్న తరుణంలో అవెంజర్స్ కలెక్షన్లు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అయితే, నేనేమీ స్ట్రీమింగ్ సర్వీసులకు వ్యతిరేకం కాదు. నా దృష్టి అంతా పెద్ద తెరపై ఉంటుదంతే. ఇప్పటికీ ప్రజలు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం నాకు సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
2009లో విడుదలైన ‘అవతార్’ ఏ చిత్రానికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ డాలర్లు వసూళ్లందుకుంది. ఇటీవల ‘ఎండ్‌గేమ్’ 2.79 బిలియన్ డాలర్లు సాధించి ‘అవతార్’ రికార్డును బద్దలుకొట్టింది. అయితే ‘ఎండ్‌గేమ్’కు ఈ ఘనత అంత సునాయాసంగా దక్కలేదు. ఈ రికార్డు సాధించడం కోసం ఆ చిత్రాన్ని రెండోసారి కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ‘ఎండ్‌గేమ్’ చిత్రబృందానికి అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!