close
హాలీవుడ్
బ్రూస్‌లీ కుమార్తె కేసు.. ఆగిన సినిమా విడుదల

బీజింగ్‌: హాలీవుడ్‌ స్టార్స్‌ లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌ పిట్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’. ఈ సినిమాను దర్శకుడు క్వెంటిన్ టరాన్టినో తెరకెక్కించారు. ఈ సినిమా చైనాలో అక్టోబరు 25న విడుదల కావడానికి సిద్ధమైంది. కానీ అక్కడ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రూస్‌లీ సన్నివేశాల్ని ఈ సినిమాలో ఉంచడమే దానికి కారణం. మరణించిన తన తండ్రికి సంబంధించిన విజువల్స్‌ను వాడుకున్నారని బ్రూస్‌లీ కుమార్తె షానన్ లీ చైనా నేషన్‌ ఫిల్మ్‌ అడ్మినిట్రేషన్‌లో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో చైనాలో అక్టోబరు 25న సినిమాను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వలేదు. చిత్రం విడుదలను తాత్కాలికంగా ఆపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారట.

ఈ ఏడాది జులైలో ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ సినిమా విడుదలైంది. ఇందులోని ఓ సన్నివేశంలో బ్రాడ్‌ పిట్‌ యంగ్‌ బ్రూస్‌లీతో ఫైట్‌ చేస్తూ కనిపించారు. ఆయనతో సులభంగా ఫైట్‌ చేసి ఓడిస్తాడు. ఈ నేపథ్యంలో బ్రూస్‌లీ కుమార్తె ఫిర్యాదు చేశారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.