
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు వెండితెర జంట ప్రభాస్, అనుష్క. ఇటీవల లండన్లో ‘బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా డార్లింగ్, స్వీటీ మీడియాతో మాట్లాడారు. ‘హాలీవుడ్ సినిమాలో నటిస్తారా?’ అని ప్రశ్నించగా ప్రభాస్ సమాధానం ఇచ్చారు. ‘హాలీవుడ్లో సరైన స్క్రిప్టు, ఆఫర్ వస్తే తప్పకుండా నటిస్తాను’ అని అన్నారు. ‘నాకు భాష అడ్డంకి కాదు. సినిమాలో నటించడమే నా పని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సినిమాల్లో నటించాలని ఉంది’ అని అనుష్క పేర్కొన్నారు.
‘సాహో’ తర్వాత ప్రభాస్ దర్శకుడు ఎస్. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె దివ్యాంగురాలి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకుడు. మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?