
ఫొటోలు షేర్ చేసిన పాప్‌స్టార్ డువా లిపా
ముంబయి: గత ఏడాది జైపూర్‌లో తనకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పారని హాలీవుడ్ పాప్‌స్టార్ డువా లిపా గుర్తు చేసుకున్నారు. ముంబయిలో అత్యంత వేడుకగా జరగనున్న ఓ కార్యక్రమంలో హాలీవుడ్ గాయని కెటీ పెర్రీ లైవ్ కాన్సెర్ట్ ఇవ్వబోతున్నారు. ఇదే కార్యక్రమంలో ఆమెతోపాటు డువా లిపా కూడా తన గాత్రంతో అలరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడాది క్రితం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘గత ఏడాది జైపూర్‌లో చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు. ఇప్పుడు మళ్లీ ఓ షో కోసం ముంబయికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందర్నీ షోలో కలుస్తా’ అంటూ డువా లిపా చీరకట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఇదే సందర్భంగా డువా లిపాను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కలిశారు. ఆమె నుంచి కొత్త జీవిత నియమాలు నేర్చుకున్నానని చెప్పారు. ఆమె స్వరం అద్భుతమని, బ్యూటిఫుల్ లేడీ అని కితాబిచ్చారు. శనివారం రాత్రి ఆమె ఇవ్వబోతున్న కాన్సెర్ట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘డువా.. నీకు వీలైతే నేను నేర్పిన స్టెప్పు స్టేజ్‌పైన వెయ్యి’ అని బాద్షా ట్వీట్ చేశారు. మరోపక్క కేటీ పెర్రీ ఇటీవల ముంబయికి చేరుకున్నారు. ఆమె కోసం బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్‌తోపాటు దక్షిణాది స్టార్స్ కూడా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?