నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ప్రిరిలీజ్ వేడుక
ఇంటర్నెట్ డెస్క్: ఇండస్ట్రీలో ఇప్పుడు నిజమైన హీరోలు నిర్మాతలేనని హీరో రామ్ పోతినేని అన్నారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సందీప్ కిషన్ కెరీర్లో భారీ విజయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం వహించారు. హిపాప్ తమిళ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి యువ కథానాయకుడు రామ్ పోతినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం పలు విషయాలు పంచుకుంది.
రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలే నిజమైన హీరోలు. కరోనా సమయంలో వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. సినిమా అంటే ఎంత ప్రేమిస్తాడో డైరెక్టర్ డెన్నిస్ మాటల్లోనే తెలుస్తోంది. లావణ్య గురించి చెప్పాలంటే ఆమె తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన విషయం చాలామందికి తెలియదు. ఆమెలో చాలా వెటకారం ఉంటుంది. ఈ సినిమా సందీప్ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచి మైలురాయి అవుతుందన్న నమ్మకం ఉంది. అందరూ వచ్చి ఈ సినిమాను చూడాలి’’ అని రామ్ అన్నారు.
హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు 14మంది కొత్తవాళ్లు పనిచేశారు. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఐదేళ్ల తర్వాత వీళ్లంతా కచ్చితంగా చాలా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఈ సినిమాకు నేను హీరోగా ఎంతో.. సంగీత దర్శకుడు హిపాప్ తమిళ కూడా అంతే. సినిమా చాలాచాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో చివరి 23 నిమిషాలకు సుమక్క కామెంట్రీ చేసింది. మ్యాచ్ అదిరిపోద్ది’ అని సందీప్ అన్నారు.
డైరెక్టర్ డెన్నిస్ మాట్లాడుతూ.. ‘‘చిన్నచిన్న షార్ట్‌ఫిల్మ్‌లు చేసుకునే నేను మన జాతీయ క్రీడ హాకీ మీద సినిమా తీయడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా కోసం హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య ఎంతో కష్టపడి పనిచేశారు. 38రోజుల్లోనే సినిమా పూర్తి చేశాం. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మీలో ఎవరు లేకున్నా సినిమా ఉండేది కాదు’’ అని ముగించారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా