close
Published : 06/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి కలిసి నటిస్తోన్న అమితాబ్‌ - దీపికా

ఇంటర్నెట్‌ డెస్క్: బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొణె కలిసి హాలీవుడ్ రీమేక్‌ చిత్రం ‘ది ఇంటర్న్‌’లో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ ‘పీకూ’ చిత్రంలో నటించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా దీపికా స్పందిస్తూ ‘‘నాకు అత్యంత ప్రత్యేకమైన నటుడితో కలిసి మరోసారి పనిచేయబోతున్నందుకు ఎంతో గౌరవంగా ఉంది’’ అంటూ వెల్లడించింది. హాలీవుడ్‌ చిత్రం ‘ది ఇంటర్న్‌’లో అన్నే హాత్‌వే పోషించిన పాత్రలో దీపిక, రాబర్ట్‌ డీ నీరో పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటి స్తున్నారు. గతంలో రాబర్ట్ డీ నీరో పాత్రలో రిషి కపూర్‌ నటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఆయన మరణించడంతో దాన్ని ఇప్పుడు అమితాబ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్‌ రవిందర్‌నాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా దీపికాకు సంబంధించిన కా ప్రొడక్షన్స్, ఏథీనా ఇఎన్‌ఎమ్‌, వార్నర్‌ బ్రదర్స్ ఇండియాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్‌లో నాన్సీ మేయర్స్ దర్శకత్వం వహించిన ‘ది ఇంటెర్న్‌’ చిత్రకథ 70 ఏళ్ల రాబర్ట్ డి నిరో చుట్టూ తిరుగుతుంది. అతను ఆన్‌లైన్ ఫ్యాషన్ వెబ్‌సైట్‌లో సీనియర్ ఇంటర్న్‌గా ఉంటారు. అక్కడ ఆ సంస్థ సీఈవో (అన్నే హాత్‌వే)తో స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మిగతా కథ. 


CNR-n5fDhie

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని