
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్-ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఐరాఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో తాజాగా ప్రేమలోపడినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
గతకొన్నేళ్లుగా ఆమిర్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్ లాక్డౌన్ నుంచి ఐరాకు సైతం వర్కౌట్ల విషయంలో కోచ్‌గా మారారు. అయితే, నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఐరా అతనితో ప్రేమలోపడిందని.. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఐరా ఇప్పటికే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల ఆమిర్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికీ సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..