
హైదరాబాద్: అక్కినేని నాగార్జున.. ఆయన తనయుడు అఖిల్.. ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ఏయన్నార్ - నాగార్జున - నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనం’ చిత్రంలో అఖిల్ ఓ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున - తన ఇద్దరు తనయులతో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని తాజాగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి.. నాగ్-అఖిల్‌తో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
‘ఎఫ్-2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు చూసిన నాగ్.. అనిల్‌తో కలిసి పనిచేయాలనుకున్నారని.. దీంతో సదరు దర్శకుడు.. ఓ మంచి కథను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ సిద్ధం చేసిన కథ తనకి నచ్చడంతో నాగార్జున ఓకే అన్నారని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
‘సరిలేరు నీకెవ్వరు’ విజయం తర్వాత అనిల్ రావిపూడి.. ‘ఎఫ్-3’ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ‘ఎఫ్-3’ సినిమా కొంతకాలంపాటు వాయిదా వేసి.. నాగార్జునతో మల్టీస్టారర్ నిర్మించాలనే ఉద్దేశంలో అనిల్ ఉన్నట్లు కథనాలు దర్శమిస్తున్నాయి. నాగ్‌తో సినిమా గురించి అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం