అందుకే హీరోయిన్‌గా ఎక్కువ మూవీలు చేయలేదు - Alitho Saradaga Telugu Actresses Annapoorna and Y Vijaya
close
Updated : 24/12/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే హీరోయిన్‌గా ఎక్కువ మూవీలు చేయలేదు

హైదరాబాద్‌‌: సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు అందరూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతోనే తల్లిపాత్రలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు సీనియర్‌ నటి అన్నపూర్ణ. ఆలీ వాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి తోటి నటి వై.విజయతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వై.విజయ పదమూడేళ్లకే హీరోయిన్‌గా అవకాశం రావడం, అన్నపూర్ణకు ఉమ పేరుతో ఉన్న సంబంధం గురించి వివరించిన వారు.. అలనాటి అగ్రనటులతో వారికున్న అనుబంధం గురించి నెమరేసుకున్నారు. ఓఎల్‌ఎక్స్‌ పీస్‌లంటూ ఆలీ వారిని సరదాగా ఆటపట్టించగా నవ్వుతూనే దీటుగా సమాధానమిచ్చారు. ‘వై.విజయ లేకుంటే సినిమా చేయను’ అని రామ్‌గోపాల్‌వర్మ అనడంపైనా, అన్నపూర్ణ తన కుమార్తె మరణానికి గల కారణాలు పంచుకుంటుంటే కళ్లు చెమ్మగిల్లాయి. మరి మన ఇంట్లో మనుషుల్లా అనిపించే ఈ ఇద్దరు సీనియర్‌ నటీమణుల సంగతులు తెలుసుకోవాలంటే సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ షో చూసేయాల్సిందే.

ఇవీ చదవండి..

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని