ఒక చేతిలో జామూన్‌.. మరో చేతిలో రసగుల్లా.. - Amitabh Bachchan feels there is no bigger torture in his life than THIS
close
Published : 19/12/2020 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక చేతిలో జామూన్‌.. మరో చేతిలో రసగుల్లా..

ముంబయి: బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన పోస్టులతో అభిమానులకు మంచి సందేశాలిస్తుంటారు. తాజాగా ఆయన ఓ స్వీట్స్ యాడ్ షూట్‌లోని ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో ఆయన ఒక చేతిలో ‘రసగుల్లా’ మరొక చేతిలో ‘గులాబ్‌ జామూన్‌’ను పట్టుకున్నారు. అంతేకాకుండా ‘ఎప్పుడైతే స్వీట్లు తినటం మానేసానో, ఇప్పుడు కెమెరా ముందు ఇలా వాటిని పట్టుకొని ప్రదర్శన ఇవ్వటం కంటే ఇబ్బంది మరొకటి లేదు. ఈ స్వీట్లు చాలా రుచికరంగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి’ అంటూ ఆయన వాక్యాన్ని జతచేశారు. 

ప్రస్తుతం ఆయన అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా నాగరాజ్‌ మంజులె దర్శకత్వంలో ‘జూంద్‌’, రూమీ జాఫ్‌రే దర్శకత్వంలో ‘చెహరే’ చిత్రాల్లో అలరించనున్నారు. 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని