సమంతతో సందడి చేయనున్న చిరు..! - Chiru At SamJam Set
close
Published : 19/11/2020 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంతతో సందడి చేయనున్న చిరు..!

హైదరాబాద్‌: నటి సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘సామ్‌ జామ్‌’. ఇటీవల విజయ్‌ దేవరకొండతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారు. ఈ మేరకు ఆయన చిత్రీకరణ నిమిత్తం సెట్‌లో అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చిరు కూల్‌ లుక్‌ చూసి నెటిజన్లు.. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్లు పెడ్తున్నారు.

తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ప్రకటించి చిరు అందర్నీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవడంతో మరోసారి కరోనా సంబంధిత పరీక్షలు చేయించగా.. కొవిడ్‌ లేదని తేలిందని ఆయన ఇటీవల ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా రానున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని