
ఫన్నీగా ‘కూలీ నెం.1’ ట్రైలర్
ముంబయి: ‘ఈ ప్రపంచం నా ఇల్లు.. స్టేషన్ నా అడ్డా..’ అంటున్నాడు కథానాయకుడు వరుణ్ ధావన్. సారా అలీ ఖాన్‌తో ఆయన జోడీ కట్టిన హిందీ సినిమా ‘కూలీ నెం.1’. డేవిడ్ ధావన్ దర్శకుడు. సారా తండ్రి పాత్రలో పరేష్ రావల్ నటించారు. 1995లో గోవింద, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘కూలీ నెం.1’ను అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్ వేదికగా చిత్రం విడుదల కాబోతోంది. శనివారం విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో వీక్షకుల్ని అలరిస్తోంది. దర్శకుడు వరుణ్ ధావన్‌కు ఇది 45వ చిత్రం కావడం విశేషం.
‘‘నా కుమార్తెకు భారత్‌లో అత్యంత సంపన్నుడైన వ్యక్తి భర్తగా రావాలి అనుకున్నా.. కానీ దేవుడు దానికంటే ఎక్కువ ఆస్తి ఉన్న ధనవంతుడ్ని ఇచ్చాడు.. బుర్జ్ ఖలీఫా అతడిదే.. వైట్‌హౌస్‌ను కూడా కొనగలడు’ అని నటుడు పరేష్ రావల్ అంటున్న డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. సింగపూర్ రాజు మహేంద్ర ప్రతాప్ కుమారుడు, ప్రిన్స్ రాజ్ ప్రతాప్ సింగ్నంటూ వరుణ్ అబద్ధాలు చెబుతాడు. అదే నిజమని నమ్మి.. సారా ఆయన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. కట్ చేస్తే... ‘ఈ ప్రపంచం నా ఇల్లు.. స్టేషన్ నా అడ్డా.. నా పేరు రాజు.. అందరూ నన్ను ‘కూలీ నెం.1’ అంటారు’ అంటూ చెప్పి వరుణ్ షాక్ ఇస్తాడు. సరదా సన్నివేశాలతో రూపొందించిన ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆఖరులో లేడీ గెటప్‌లో వరుణ్ ధావన్ అదరగొట్టాడు. మరి సినిమాలో ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా
- జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు
- అసహజ బంధం.. విషాదాంతం