close
హాలీవుడ్
దీపికకు మరోసారి హాలీవుడ్‌ అవకాశం?

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌లో నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న నటి దీపిక పదుకొణె. అంతేకాదు, ‘ట్రిప్లెక్స్‌: జాండర్‌ కేజ్‌’ చిత్రంలో హాలీవుడ్‌లోనూ తన ముద్రవేసింది. ఇప్పుడు మరోసారి అక్కడ సందడి చేయడానికి సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హాలీవుడ్‌లో ‘ట్రిప్లెక్స్‌’ సిరీస్‌ చిత్రాలకు విశేషమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కూడా దీపిక పదుకొణె నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు నటుడు విన్‌ డీజల్‌ చేసిన పోస్ట్‌ తాజా వార్తలకు బలం చేకూరుస్తోంది. 

‘ప్రతి ఫ్రాంఛైజీ కుటుంబంలా ఓ అందమైన అనుభూతిని ఇస్తోంది. జాండర్‌ కేజ్‌ విషయంలోనూ ఇదే జరిగింది’ అని పేర్కొంటూ హ్యాష్‌ ట్యాగ్‌లో దీపిక పదుకొణె పేరుతో పాటు ‘జాండర్‌కేజ్‌4’ అని కూడా విన్‌ డీజిల్‌ పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.  అయితే, నాలుగో భాగానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎప్పుడు మొదలవుతుంది? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.