
బికినీ.. నాకు నచ్చదు!
హైదరాబాద్: ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసి దక్షిణాదిలోనే కాక బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుతున్నారు తాప్సీ. ‘సాండ్ కీ ఆంఖ్’, ‘తప్పడ్’ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తాప్సీ ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు.
హాలీడే టూర్..
‘లాక్డౌన్ వల్ల కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమయ్యా. ఆరు నెలలుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అందుకే ఇటీవల నేను మాల్దీవులకు వెళ్లాను. వెకేషన్ బాగా ఎంజాయ్ చేశా. హాలీడేకు వెళ్లడానికి ముందు కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా. వెకేషన్ నుంచి వచ్చాక బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంటున్నా.’
అందం..
‘అందంగా కనిపించడమంటే స్కిన్ షో కాదు అని నా భావన. ఈ విషయంలో నేను ఎన్నో నియమాలు పెట్టుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల కోసం బికినీ ధరించడానికి నో చెప్పలేదు. కానీ, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు. ఫ్యాన్స్ కూడా నన్ను బికినీలో చూడడానికి ఇష్టపడరు.’
ఫస్ట్‌క్రష్..
‘తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా తోటి విద్యార్థిని ఇష్టపడ్డాను. అదే నా ఫస్ట్ క్రష్. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. చదువుపై దృష్టిసారించాలనే ఉద్దేశంతో కొంతకాలానికి మాట్లాడడం మానేశాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో పబ్లిక్ ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేసి బాగా ఏడ్చేశాను. ఫస్ట్ క్రష్ ఎప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకంగానే ఉంటుంది’
ట్రోల్స్..
‘సోషల్‌మీడియాలో నేను యాక్టివ్‌గా ఉంటాను. నా లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటాను. వేరొకరి విషయాలు నేను పట్టించుకోను. అలాగే నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను. అలాంటివాళ్లకి నా స్టైల్లోనే సమాధానం చెబుతా. కొంతమంది చేసే కామెంట్లను అంగీకరిస్తాను. కానీ ట్రోల్ చేయాలనే ఉద్దేశంలో పలువురు వ్యక్తులు కావాలని చేసే నెగెటివ్ కామెంట్లకు దీటుగా సమాధానమిస్తా’
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- అసహజ బంధం.. విషాదాంతం
- చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా