
హైదరాబాద్: గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, అనసూయల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
షోలో భాగంగా హైపర్ ఆది టీమ్ ‘అక్కా ఎవరే అతగాడు’ స్పూఫ్‌తో, నాన్ స్టాప్ పంచులతో సందడి చేయనున్నారు. ఈ స్కిట్లో భాగంగా ప్రతి ఒక్కరు సెలబ్రిటీ గెటప్ ఫొటోలతో వచ్చి.. ‘నా పేరు వర్షిణి, నా పేరు రష్మి అనగా.. ఇంతలో రోజా అందుకొని నా పేరు రోజా.. ఈ ఈవెంట్ చేయనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. లేదంటే ఎవరు ఏ బోర్డు వేసుకొని వస్తారో అర్థం కావట్లేదు..’ అంటూ సరదాగా పంచులతో నవ్వులు పూయించనున్నారు. వెంకీ మంకీస్, చలాకీ చంటి, తాగుబోతు రమేష్ స్కిట్లు సైతం ఆకట్టుకోనున్నాయి. అంతేకాకుండా రాకెట్ రాఘవ-రోజా మధ్య జరిగే వరుస పంచులతో ఆకట్టుకోనుంది. ఆద్యంతం పంచులతో నవ్వులు పూయించే ఈ కామెడీ ప్రపంచంలోకి వెళ్లాలంటే వచ్చే గురువారం (డిసెంబర్ 3)న ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ చూడాల్సిందే..!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..