close
అవీ.. ఇవీ..
ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో

రజనీ మూవీ ఆఫర్‌పై ‘అసురన్‌’ భామ స్పందన

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో రానుందంటూ ఇటీవల కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో రజనీకాంత్‌ సరసన ‘అసురన్‌’ ఫేం మంజు వారియర్‌ నటించనున్నారంటూ సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో నటి మంజు వారియర్‌.. తన గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. రజనీకాంత్‌ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తమని ఆమె తేల్చి  చెప్పారు. ‘రజనీకాంత్‌ సినిమాలో హీరోయిన్‌గా నేను నటించనున్నానంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయంపై ఇప్పటివరకూ నన్ను ఎవరూ అధికారికంగా సంప్రదించలేదు. ఇదో అవాస్తవ వార్త. సోషల్‌మీడియాలో ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో నాకర్థం కావడం లేదు’ అని మంజు తెలిపారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.