close
కొత్త సినిమాలు
విజయ్‌ పాడిన పాట వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఇళయ దళపతి’ విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఆండ్రియా, మాళవిక మోహనన్‌ కథానాయికలు. విజయ్‌ సేతపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ ఆలపించిన ‘కుట్టి స్టోరీ’ పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలకు అనురాజా కామరాజ్‌ సాహిత్యం అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు, ఈ లిరికల్‌ వీడియోను డిజైన్‌ చేసిన విధానమూ ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ ‘వై దిస్‌ కోలవెరి’ని గుర్తు చేస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన  పోస్టర్లు విజయ్‌ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.