
మై హ్యాపీ ప్లేస్ @ రానా
హైదరాబాద్: రానాపై తనకున్న ప్రేమను తొలిసారి బయటపెట్టారు ఆయనకు కాబోయే సతీమణి మిహికా బజాజ్. తాజాగా రానా, మిహికాల ‘రోకా’ వేడుకగా హైదరాబాద్‌లో సందడిగా జరిగింది. ఉత్తరాది సంప్రదాయాల్లో ఘనంగా జరుపుకొనే ఈ వేడుకలో వరుడు, వధువు కుటుంబాలకు చెందిన పెద్దలు ఒకచోట కలుసుకుని పెళ్లి పనులు, నిశ్చితార్థం గురించి చర్చించుకుంటారు. అయితే బుధవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను రానా ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ఇక మా బంధం అధికారికమైంది’ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మిహికా సైతం తనకు కాబోయే భర్త రానాతో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా మొదటిసారి షేర్ చేశారు. ‘నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం’ అని క్యాప్షన్ ఇచ్చారు. రానాతో నవ్వులు పూయిస్తున్న మరో ఫొటోను షేర్ చేస్తూ.. ‘మై హ్యాపీ ప్లేస్ @ రానా’ అని తెలిపారు. మిహికా పెట్టిన పోస్టులు చూసిన సినీ ప్రముఖులు, బజాజ్ కుటుంబసభ్యులు, నెటిజన్లు సంతోషించారు. ‘కంగ్రాట్స్ మిరా (మిహికా+రానా)’, ‘లవ్లీ కపుల్’, ‘చూడముచ్చటైన జంట’, ‘మీ కథ ఎంతో మధురమైనది. మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బజాజ్ కుటుంబంలోకి రానాకు స్వాగతం’ అని కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి..
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- యూఎస్‌లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలి
- ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
- అది నా గొప్పతనం కాదు: ద్రవిడ్
- అరవింద్‌స్వామి దొంగావతారం.. రెహమాన్ ఫన్నీ పోస్ట్