ఈ ఏడాది కిక్ ఇచ్చిన క్లిక్స్‌ ఇవే..! - Most Liked Pics Of South Industry In 2020
close
Published : 22/12/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది కిక్ ఇచ్చిన క్లిక్స్‌ ఇవే..!

కోట్లాదిమంది మది దోచిన ఫొటోలు చూశారా

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌బాబు-చిరంజీవి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే.. మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ కలిసి సందడి చేస్తే.. చదవడానికే ఎంతో ఆసక్తిగా ఉంది కదా.. మరి అలాంటి మధురమైన జ్ఞాపకాలెన్నో ఫొటోల రూపంలో ఈ ఏడాది ప్రతిఒక్కర్నీ ఆకర్షించాయి. ఏడాది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ దక్షిణాది సినీ తారలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారి.. కోట్లలో లైక్స్‌.. లక్షల్లో కామెంట్లు సొంతం చేసుకున్నాయి. సినీ ప్రియులకు కిక్‌ ఇచ్చిన అలాంటి కొన్ని క్లిక్స్‌పై ఓ లుక్కేద్దాం..

ప్రేమతో.. చిరంజీవి-మోహన్‌బాబు

కొత్త సంవత్సర వేడుకల్ని మరింత రెట్టింపు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబును చిరంజీవి ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్నారు. ‘పిక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఈ ఫొటో కోట్లలో లైక్స్‌ సొంతం చేసుకుంది.


హీరో-విలన్‌ కలిస్తే

విజయ్‌ కథానాయకుడిగా విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరిలో పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్‌ షూట్‌ పూర్తైన సందర్భంగా విజయ్‌ సేతుపతి.. హీరో విజయ్‌ని ఆత్మీయంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ ఫొటో ఎంతోమందిని మెప్పించింది.


కుటుంబం ఇది దగ్గుబాటి కుటుంబం

టాలీవుడ్‌లోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరుపొందిన నటుల్లో ఒకరైన రానా ఈ ఏడాదిలోనే ప్రేమ.. పెళ్లితో అందరికీ షాక్‌ ఇచ్చాడు. తన ప్రేయసి మిహీకా బజాజ్‌ మెడలో ఆగస్ట్‌ 9న మూడుముళ్లు వేశారు. వీరి వివాహ వేడుకల్లోని కొన్ని ఫొటోలు అందర్ని ఆకర్షించాయి. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లితంతుకి సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీ పిక్‌ ఆకట్టుకుంది.


కన్నీరు తెప్పించారు..

కన్నడ నటుడు చిరుసర్జా ఈ ఏడాది జూన్‌ నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. చిరు సర్జా సతీమణి నటి మేఘనా రాజ్‌ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన అన్న కుమారుడ్ని చేతిలోకి తీసుకుని మురిసిపోయిన ధ్రువ్‌ సర్జా... ఆ బాబుని కొంతసమయంపాటు చిరు సర్జా ఫొటో వద్ద ఉంచారు. అప్పట్లో ఈ ఫొటో అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మెరుపులు

సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఈ ఏడాది దీపావళి కానుకగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రతి పండగకి ఏదో ఒక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపే ఈ టీమ్‌.. దీపావళికి మాత్రం కొంచెం విభిన్నంగానే ఆకట్టుకుంది. రాజమౌళి-ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లతో ఓ స్పెషల్‌ ఫొటోషూట్‌ నిర్వహించి.. ఆ ఫొటోల్ని పండగ సందర్భంగా అభిమానులతో పంచుకుంది.


మెగాఫ్యామిలీ.. ఆ కిక్కే వేరప్పా

నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్య జొన్నలగడ్డల వివాహం ఇటీవల ఉదయ్‌పుర్‌లో వేడుకగా జరిగింది. ఎన్నో అపురూప క్షణాలకు ఈ పెళ్లి వేడుకైంది. ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ రాకతో ఈ వేడుకల్లో మరింత జోష్‌ నెలకొంది. మెగా, అల్లు కుటుంబసభ్యులందరితో అకీరా దిగిన ఓ ఫొటో సినీ ప్రియులకు ఇచ్చిన కిక్‌ అంతా ఇంతా కాదు. అదే వేడుకలో చిరు.. తన తమ్ముడు కుమార్తె ఆద్యాను ప్రేమగా దగ్గరకు తీసుకుని.. ఫొటోలకు పోజులిచ్చారు. ఇవీ కూడా హైలెట్‌ అనే చెప్పాలి.


స్టార్స్‌ కలిస్తే..

తెలుగు చిత్రపరిశ్రమలో పేరుపొందిన హీరోలందరూ ఒకేచోట కలిస్తే.. చూడడానికి రెండు కళ్లు సరిపోవని ఇటీవల రుజువైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బర్త్‌డే పార్టీలో అగ్ర, యువ తారలందరూ సందడి చేశారు. పార్టీలో భాగంగా మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగ చైతన్య కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి మాత్రమే కాకుండా కాజల్‌ పెళ్లి, ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్‌, అభిమానులతో ప్రభాస్‌, రజనీకాంత్‌ కారు డ్రైవింగ్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మరెన్నో ఫొటోలు ప్రతిఒక్కరికీ మర్చిపోలేని కిక్‌ను అందించాయి.

ఇదీ చదవండి
ఓటీటీలో మెరిసిన అగ్ర తార ఎవరు?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని