ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. షాకైన అమ్మవారు..! - Nayanthara Ammoru Thalli Official Telugu Trailer OUT
close
Published : 26/10/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. షాకైన అమ్మవారు..!

హైదరాబాద్‌: ‘దేవుడే లేడంటున్న వాడు ఓకే.. ఒక దేవుడిని పొగుడుతూ ఇంకో దేవుడుని తిట్టేవాడు చాలా డేంజర్‌’ అంటున్నారు నయనతార. ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘మూకుతి అమ్మన్‌’. తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్‌.జె.శరవణన్, ఆర్‌.జె.బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ని కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు.

తమ కష్టాలను తీర్చమని ఓ కుటుంబం తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు?నిజంగా ఆమె అమ్మవారేనా? తెలియాలంటే ‘అమ్మోరు తల్లి’ సినిమా చూడాల్సిందే. ‘మీ శక్తితో ఆన్‌లైన్‌ క్లాస్‌ను క్యాన్సిల్‌ చేస్తారా’ అంటూ అమ్మవారి పాత్ర పోషించిన నయనతారను అడగ్గా, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సన్నివేశం నవ్వులు పంచుతోంది.

ఈ సందర్భంగా మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ, ‘‘ఆర్జే బాలాజీ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నయనతారతో కలిసి నటించిన ‘అమ్మోరు తల్లి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా నవంబరు 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని