close
హాలీవుడ్
ఈసారి కూడా ఆస్కార్‌ వేడుకలో...

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే అకాడమీ అవార్డు ‘ఆస్కార్‌’.  ప్రతి సంవత్సరం ఫ్రిబ్రవరిలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది.  ఈ ఏడాది కూడా అలాంటి ప్రణాళికలే సిద్దం చేస్తోంది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌. అయితే 2019 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్రముఖ నటుడిని హోస్ట్‌గా నియమించేవారు. కానీ 2019లో ఈ విధానానికి స్వస్తి పలికి మొదటిసారి అకాడమీ వేడుకలో హోస్ట్‌ లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఇప్పుడు ఈ పద్దతిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా తెలిపింది అకాడమీ. అందుకు సంబంధించి చేసిన ట్వీట్‌లో ఈ సారి జరిగే వేడుకలో ప్రపంచ సినీ అగ్రశేణి తారలు, అందరిని ఆకట్టుకునే అద్బుతమైన ప్రదర్శనలు, చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని కానీ, హోస్ట్‌ మాత్రం ఉండడని తెలిపింది. ఈ సోమవారం  2020 ఆస్కార్‌ బరిలో ఉన్న పోటీదారుల జాబితాను విడుదల చేయనున్నారు. ఫ్రిబ్రవరి 9న ఈ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. ఈ వేడుకను వీక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.