ఆర్మీ దుస్తుల్లో.. ఎవరబ్బా! - PC in army dress
close
Published : 12/12/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్మీ దుస్తుల్లో.. ఎవరబ్బా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంకా చోప్రా. తనకు తండ్రి అశోక్‌ చోప్రా అంటే ఆమెకు ఎంతో అభిమానమన్న సంగతి ఈ మాజీ మిస్‌ వరల్డ్‌ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఓ చిన్నారి ఆర్మీ యూనిఫారంను ధరించి ఉన్న చిత్రాన్ని తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అంతేకాదు, ‘లిటిల్‌ ప్రియాంక’ అంటూ వ్యాఖ్యను కూడా జోడించారు. దీంతో ఆ చిన్నారి పిగ్గీ ఛాప్స్‌ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోయారు.

ఈ చిత్రం త్వరలో ప్రచురించనున్న తన పుస్తకంలోనిదని ప్రియాంక వివరించారు.  చిన్నప్పుడు ఆర్మీలో ఉన్నతాధికారి అయిన తండ్రి దుస్తుల్ని ధరించి ఇల్లంతా తిరిగేదాన్నని.. పెరిగి పెద్దయ్యాక ఆయన లాగానే కావాలనుకున్నానని ఆమె వెల్లడించారు.  ప్రియాంక చోప్రా జీవిత విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ బుక్స్‌ ఆవిష్కరించనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని