టెన్త్‌ తప్పిన రానా.. నటుడు ఎలా అయ్యాడంటే
close
Published : 02/03/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెన్త్‌ తప్పిన రానా.. నటుడు ఎలా అయ్యాడంటే

ఎన్టీఆర్‌ సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్న హీరో

హైదరాబాద్‌: ‘రానా నటుడవుతాడని ఎప్పుడూ అనుకోలేదు’ అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు వెంకటేశ్. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్‌’ సినిమాతో అర్జున్‌ ప్రసాద్‌గా వెండితెరకు పరిచయమై ఒక నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన టాలీవుడ్‌ యువ హీరో రానా దగ్గుబాటి. ఈ ఏడాదితో ఆయన వెండితెరకు పరిచయమై సరిగ్గా పదేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి తప్పిన రానా నటుడిగా ఎలా మారడానే విషయాన్ని తెలియచేస్తూ #RD10 పేరుతో ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించారు. తాజాగా సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ #RD10 ఛాప్టర్‌1 వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో రానా తండ్రి సురేశ్‌బాబు, బాబాయ్‌ వెంకటేశ్‌తోపాటు దర్శకులు క్రిష్‌, నాగ్‌ అశ్విన్‌.. ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా యువ హీరోలు చరణ్‌, బన్నీ, నాగచైతన్య.. రానా నటనను ప్రశంసిస్తూ కనిపించారు. 

‘మా నాన్న మెకానికల్‌ ఇంజనీర్‌, వెంకీ బాబాయ్‌ ఎంబీఏ. వాళ్లందరూ బాగా చదువుకున్నవారు. కానీ నేను పదో తరగతి ఫెయిలయ్యాను. జీవితంలో ఏం సాధించాలో తెలియకుండా, ఒక గోల్‌ అంటూ లేకుండా ఉన్నాననిపించేది. చరణ్‌, బన్నీ నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కెరీర్‌పై వాళ్లకి ఒక క్లారిటీ ఉండేది. నాకు సినిమా అంటే ఇష్టమని మాత్రమే నాకు తెలుసు. సినిమానే వృత్తిగా చేసుకోవచ్చని, జీవితం అంతా సినిమాలోనే జీవించవచ్చని ఒకానొక సమయంలో అర్థం చేసుకున్నాను. వీఎఫ్‌ఎక్స్‌ బిజినెస్‌ ప్రారంభించాను.’అని రానా చెప్పారు

వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా మారిన రానా 85 సినిమాలకు పనిచేశారు. 2006లో విడుదలైన ‘సైనికుడు’ సినిమాకిగాను బెస్ట్‌ విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో ఆయన నంది అవార్డును అందుకున్నారు. అలాగే తన స్నేహితుడు ప్రకాశ్‌తో కలిసి ‘బొమ్మలాట’ ఓ సినిమాని కూడా రానా నిర్మించారు. ఈ సినిమా జాతీయ అవార్డును అందుకుంది.

నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాక ఆయన స్టంట్స్‌ స్కూల్‌కి వెళ్లి శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లి నటుడికి కావాల్సిన ఎన్నో రకాల శిక్షణలను తీసుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నారు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని