రానాతో పనిచేయడం నా అదృష్టం: సాయిపల్లవి - Rana believes in equality and it is a blessing to work with him Says SaiPallavi
close
Published : 12/12/2020 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానాతో పనిచేయడం నా అదృష్టం: సాయిపల్లవి

అనుష్క, నయన్‌.. నిర్మాతలకు నమ్మకాన్ని ఇచ్చారు

హైదరాబాద్‌: సమాజంలో ప్రతిచోటా లింగ వివక్ష చూపిస్తారని నటి సాయిపల్లవి అన్నారు. లింగ వివక్ష అనేది కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా మరెన్నో రంగాల్లో ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్త్రీ, పురుషుల అసమానత గురించి ఆమె స్పందించారు. అంతేకాకుండా లింగ సమానత్వానికి ప్రాముఖ్యత ఇచ్చే తన తోటి సహనటుల గురించి ఆమె వెల్లడించారు.

‘కొన్ని సంవత్సరాల క్రితంతో పోలిస్తే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఇండస్ట్రీలో మంచి పాత్రలను పొందగలుగుతున్నాను. నయనతార, అనుష్కశెట్టి లాంటి నటీమణుల వల్ల ఒక నటి మొత్తం సినిమాని తన భుజాలపై వేసుకోగలదనే నమ్మకం నిర్మాతలకు వచ్చింది. ప్రతిరంగంలోనూ లింగ వివక్ష ఉంది. ఇప్పుడిప్పుడే సమానత్వం దిశగా పరిస్థితులు కూడా మారుతున్నాయి’

‘‘ప్రస్తుతం నేను ‘విరాటపర్వం’ కోసం రానాతో కలిసి పనిచేస్తున్నా. నిజంగా ఆయన చాలా గొప్పవ్యక్తి. అసాధారణమైన మనిషి. ఏదైనా సినిమాలో ఓ నటి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించినప్పటికీ కేవలం హీరో పేరును మాత్రమే పోస్టర్‌పై వేస్తారు. ఇది మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ‘విరాటపర్వం’లో నాది కీలకమైన పాత్ర. టైటిల్‌ కార్డ్స్‌పై తన పేరుతోపాటు నా పేరు కూడా ఉంచుతున్నట్లు రానా నాతో చెప్పారు. ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదు. కేవలం ఆ సినిమాలో నటించడం మాత్రమే నా బాధ్యత అనుకున్నా. కానీ, రానా ఇలాంటి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. లింగ సమానత్వానికి ఆయన విలువనిస్తారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని సాయిపల్లవి వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని